- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. డిజిటల్ మీటర్ ద్వారా తమ హైట్‌ను తక్కువ చేసి చూపించి డిస్ క్వాలిఫై చేస్తున్నారని ఆదివారం హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీస్ గ్రౌండ్స్‌లో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రీ మెజర్మెంట్స్ కోసం అంబర్‌పేట్ పొలీస్ గ్రౌండ్స్‌లో హైట్ చెకింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే, గతంలో వచ్చిన హైట్ కంటే రీ మెజర్మెంట్‌లో తక్కువ వచ్చిందంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.
మాన్యువల్‌గా హైట్ చెక్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా డిజిటల్ మీటర్‌తో చెక్ చేసి డిస్ క్వాలిఫై చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన తమను బోర్డు, ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చెకింగ్ చేసినప్పుడు వచ్చిన హైట్.. ఇప్పుడు ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. తమను మెయిన్స్‌కు క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.