- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
26న 700 మంది ఏఈఈలు..1800మంది లష్కర్ లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో..పక్కా ప్రణాళికతో ముందుకెలుతుంది. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన నియామక ప్రక్రియలను పూర్తి చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్ల జారీతో ముందుకెలుతుంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఇప్పటికే 34వేల కొత్త నియామకాలు పూర్తి చేయగా..అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేసింది. కొత్తగా నీటి పారుదల శాఖలో ఖాళీల భర్తీకి సిద్దమైంది. కొత్తగా నియమితులైన 700 ఏఈఈలకు, 1800 మంది లష్కర్ లకు ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్ది చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఎర్రమంజిల్ జలసౌధ వేదికగా ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.