నేటి నుంచే ఒక్కపూట బడులు.. పిల్లలు జాగ్రత్త

by Mahesh |
నేటి నుంచే ఒక్కపూట బడులు.. పిల్లలు జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఒక్కపూట బడులు స్టార్ట్ అవుతాయని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నడుపుతాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించబడుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్క్యులర్ జారీ చేసింది. కాగా ఈ ఏడాది ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.

Advertisement

Next Story