Occult Worships: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం

by Ramesh Goud |
Occult Worships: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లో క్షుద్రపూజలు(Occult Worships) కలకలం రేపాయి. మహాదేవపూర్ మండలం(Mahadevpur Mandal) కుదురుపల్లి గ్రామం(Kudurupally Village)లోని స్థానిక యువకులు ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. ఈ యువకులకు వాగులో క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వారు భయాందోళనకు గురై గ్రామస్థులకు సమాచారం అందించారు. కుదురుపల్లి వాగులో మేకపోతును బలిచ్చి, కొబ్బరికాయలు, అన్నం బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఈ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను చూసిన జనం ఆందోళన పడుతున్నారు. దీనిపై విచారణ జరిపి నిందితులు ఎవరో గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేగాక ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed