- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టు 15న రుణమాఫీ చేస్తారని నమ్మకం లేదు: ఎన్వీ సుభాష్
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ప్రతి చోట బీజేపీ గెలుపొందిందని, ఈ విజయాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కైనా బీజేపీని నిలువరించలేకపోయారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, సీఎం సొంత జిల్లా పాలమూరులో, రేవంత్ ఇన్చార్జీగా ఉన్న చేవెళ్లలోననూ బీజేపీ విజయం సాధించిందని ఆయన కొనియాడారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకోవాలని ఓట్లడిగారని, 16 స్థానాలు వస్తాయన్నారని, కానీ 8 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైందని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తారని నమ్మకం లేదని, దీనిని డిసెంబర్ 9కి వాయిదా వేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. రుణమాఫీకి రూ.40 వేల కోట్ల కావాలని, ఎక్కడి నుంచి తెస్తారో రైతులకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్‌లో ఎలా ఓడిపోయామనే అంశంపై ఉన్న శ్రద్ధ, రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్‌పై లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కేవలం తన కుర్చీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్యారెంటీలను పూర్తిగా పక్కకు పెట్టారన్నారు. 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్ డకౌట్ అయిందని, ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవలేదన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వందకు 18 మార్కులతో ఫెయిల్ అయ్యి సంబురాలు చేసుకుంటోందని ఎద్దేవాచేశారు. గతం కంటే బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. గతంలో నెహ్రూ మూడోసారి పీఎం అయ్యారని, ఆ రికార్డ్ మోడీ బద్దలుకొట్టారన్నారు. షేర్ మార్కెట్‌లో స్కాం జరిగితే రెగ్యులర్ అధారిటీకి కంప్లైంట్ చేయాలని విఠల్ సూచించారు. కాంగ్రెస్ హయాంలో హర్షత్ మెహతా స్కాం జరిగిందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రెగ్యులర్ అధారిటీనీ రాహుల్ గాంధీ మర్చిపోయారా అని ఫైరయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలిశాక మార్కెట్ విపరీతంగా పెరిగిపోయిందే తప్పితే.. ఎన్డీయే అధికారంలోకి వస్తుందని మార్కెట్ పడిపోలేదని, ఇది రాహుల్ గాంధీకి ఎలా అర్థమైందో తెలియడం లేదని చురకలంటించారు. మార్కెట్ అంటే కేవలం అదానీ, అంబానీయే కాదని, దేశ ప్రజలు కూడా ఉంటారని తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో క్యాపిటలిస్ట్‌లకు ఇష్టమొచ్చినట్లుగా అప్పులిప్పించి, దేశం వదిలి పారిపోయేలా చేశారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకులను సొంత ఏటీఎంలా వాడుకుందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు పదేండ్ల తరువాత కూడా 99 సీట్లలోనే గెలిచిందని కిశోర్ రెడ్డి చురకలంటించారు.