- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేపర్ లీకేజీ ఘటన TSPSC నిర్లక్ష్యానికి నిదర్శనం: NSUI
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో సోమవారం ఎన్ఎస్‌యూఐ ఆందోళనకు దిగింది. గాంధీభవన్ నుంచి ర్యాలీగా వచ్చిన ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం టీఎస్పీఎస్సీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఎన్ఎస్‌యూఐ నేతలు పేర్కొన్నారు.
ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. అధికారులకు తెలియకుండా ఈ తతంగం జరగదని, ఎలాంటి స్పష్టత లేకుండా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని మండిపడ్డారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకోని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.