తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

by Sathputhe Rajesh |
తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎదుగుతున్న తెలంగాణకు మట్టిబిడ్డల సహకారం కావాలని ఇందుకోసం తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని రాష్ట్ర వ్యసవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపనిచ్చారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్ష్యతన జరిగిన ప్రవాస తెలంగాణవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ...

తొమ్మిదేళ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయిందని, హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులతో తెలంగాణకు వరస కడుతున్నాయన్నారు. 24 గంటల కరెంట్, సాగునీరు, తాగునీరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనతో ముందడుగు వేస్తున్నదని తెలిపారు.

రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, అందుబాటులో విత్తనాలు, ఎరువులతో తెలంగాణ సాగు దశ మారిందని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాలలో తెలంగాణ వేగంగా విస్తరిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ఇస్తున్న అవార్డులే దీనికి నిదర్శనమన్నరు. ఈ సందర్భంగా మంత్రికి హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో వేద పండితులు ఆశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి కానుగంటి, టోని జాను, మోహిత్ కర్పూరం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు అనిల్ బందారం, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి కంచర్ల, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షురాలు మహాతి రెడ్డి, నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, భానుప్రసాద్ ధూళిపాల, శేఖరం కొత్త, హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు సాయి వర్మ, సీతారాం రెడ్డి భవనం, శ్రీకాంత్ జలగం, అశోక్ వర్దనం, నరేందర్ మెతుకు తదితరులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.

Advertisement

Next Story