TRS MLC Kalvakuntla Kavitha :కవితకు నోటీసులు.. అసలేంటి CRPC 91?

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-12 05:57:57.0  )
TRS MLC Kalvakuntla Kavitha :కవితకు నోటీసులు.. అసలేంటి CRPC 91?
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరాను విచారించిన సీబీఐ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును చేర్చిన విషయం తెలిసిందే. ఆదివారం కవిత ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు ఆమెను 7:30 గంటల పాటు విచారించారు. అయితే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇచ్చిన సీఆర్‌పీసీ 91 నోటీసులు చర్చనీయాంశమైంది. అసలు సీఆర్ పీసీ 91 అంటే ఏంటో తెలుసుకుందాం. సీఆర్‌పీసీ నోటీసుల్లో రెండు సబ్ క్లాస్‌లు ఉంటాయి. సీఆర్ పీసీ సబ్ క్లాస్ 1 ప్రకారం నోటీసులు అందుకున్న వారు విచారణ సమయంలో కేసుకు సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్, మెటీరియల్ ఇవ్వాల్సి ఉంటుంది. పత్రాలు, సీడీలు, ఫోన్లు, ఇతర మెటీరియల్ ఎవిడెన్స్ సమర్పించాల్సి ఉంటుంది. సీబీఐ ఆఫీసుకు స్వయంగా వెళ్లి ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు తెలిపారు.

సీఆర్ పీసీ సబ్ క్లాస్ 2 ప్రకారం సీబీఐ ఆఫీస్‌కు వెళ్లకుండా అయినా ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరితోనైనా డాక్యుమెంట్స్ పంపే వెసులుబాటు కల్పిస్తారు. కోర్టు లేదా దర్యాప్తు అధికారులు ఏదైనా డాక్యుమెంట్ లేదా వస్తువు విచారణకు అవసరమని భావిస్తే ఆ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉందని అనుమానిస్తున్నారో వారికి సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు ఇస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు చెందిన కీలక ఆధారాలు ఉండవచ్చని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ‌సీఆర్ పీసీ 91నోటీసులు జారీచేసింది. నోటీసుల్లో ఉన్న సంబంధిత పేర్లు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. లిక్కర్ స్కాం విచారణలో భాగంగా మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు ఎమ్మెల్సీకి కవితకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సారి కవితకు సబ్ క్లాస్ 1 ద్వారా నోటీసులు ఇచ్చారా లేదా సబ్ క్లాస్ 2 నోటీసులు జారీ చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read...

తెలంగాణతోనే పోదాం.. దేశమంతా ప్రచారానికి బీఆర్ఎస్ ప్లాన్

Advertisement

Next Story