Ponnam: మందు పార్టీలపై మరోసారి మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-11-04 06:44:04.0  )
Ponnam: మందు పార్టీలపై మరోసారి మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరు కాదన్నా కులగణన (caste census) ఆగదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. కుల గణనకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఇది ఇష్టం లేని కొన్ని రాజకీయ పార్టీలు కాళ్ళల్లో కట్టెలు పెట్టేలా అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్ లో ప్రతిపక్షాల ఉనికి ఉండాలంటే కులగణనకు సహకరించాలన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి (Vijayawada Indrakeeladri) అమ్మవారిని దర్శించుకున్న పొన్నం అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. కులగణన విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చట్టపరమైన అన్ని అంశాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సర్వే కోసం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కులగణన తెలంగాణకు ఒక దిక్సూచిగా మారబోతున్నదన్నారు.

నైట్ పార్టీలపై నిషేధం లేదు:

హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్ కల్చర్ (Farm house culture), నైట్ కల్చర్ (Night culture) నడుస్తోంది. వాటికి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ((Alcohol Ban)) కూడా లేదు. కానీ అదంతా చట్టానికి లోబడే ఉండాలన్నారు. అశ్లీలత, మాదక ద్రవ్యాలు లేకుండా పార్టీలు చేసుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ పక్కవారు ఫిర్యాదుతో అధికారులు దాడులు చేస్తే దాన్ని ప్రభుత్వం నెట్టడం సరికాదన్నారు. ఉద్యమాలు, నిరసనలపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం లేదని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పునః సమీక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంకా మెరుగైన సేవలు ఏం చేయగలమో అవి చేస్తామన్నారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లు మా ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని వాటిని మేము స్వీకరిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed