Bandi Sanjay పై నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు

by GSrikanth |   ( Updated:2023-01-07 07:49:09.0  )
Bandi Sanjay పై నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. 'బండి'తో పాటు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సహా మరో ఐదుగురి బీజేపీ ముఖ్య నేతలపై దేవన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌‌లో నాన్‌ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ గతకొన్ని రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో అన్నదాతల జేఏసీ శుక్రవారం రోజున కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టరేట్‌ను ముట్టడికి వచ్చారు. బండి సంజయ్ ఆ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులను తోసేపి కలెక్టరేట్ గేటు వైపు దూసుకెళ్లారు. దీంతో పరిస్థితులు చేదాటకుండా పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. ఈ పరిణామాలతో కలెక్టరేట్ వద్ద సుమారు రెండు గంటల పాటు హైడ్రామా నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత నుడుమ బండి సంజయ్‌ను పోలీసు వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.

Also Read..

వివాదంలో అసదుద్దీన్ ఒవైసీ.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Advertisement

Next Story

Most Viewed