- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టూరిజం శాఖకు నిధులు ‘నిల్’.. బడ్జెట్‌లో పైసా కేటాయించని సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: టూరిజం శాఖ శాఖకు రాష్ట్ర బడ్జెట్ 2024-25లో ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వం 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 1,117కోట్లు కేటాయించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క టూరిజం ఊసే ఎత్తలేదు. కేవలం ఇకో టూరిజం అబివృద్ధి చేస్తున్నట్లు మాత్రం ప్రకటించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. దేవాదాయ శాఖ సహకారంతో టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో వృథాగా ఉన్న పర్యాటకశాఖ ఆస్తులను లాభసాటిగా మార్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించామన్నారు. అనువైన అటవీ ప్రాంతాలను ఎంపిక చేసుకొని పర్యావరణహితంగా ఉండేలా వాటిని పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతామన్నారు. వాటిని ఐటీ ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తామన్నారు. రామప్ప ఆలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని, ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం పరిసరాల్లోని శిథిల దేవాలయాలను పునరుద్దరించేందుకు కార్యచరణ చేపడతామని తెలిపారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం వీటి గురించి ప్రస్తావించలేదు.