బాన్సువాడలో నిర్మలా సీతారామన్ కాన్వాయ్ అడ్డగింత

by GSrikanth |   ( Updated:2022-09-02 06:46:18.0  )
బాన్సువాడలో నిర్మలా సీతారామన్ కాన్వాయ్ అడ్డగింత
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం బాన్సువాడకు చేరుకున్న కేంద్రమంత్రి మండలంలోని కొయ్యగుట్ట అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యకర్త తుప్తి ప్రసాద్ ఇంట్లో నిర్మల సీతారామన్ అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్పాహారం అనంతరం బీర్కూర్ మండల కేంద్రానికి బయలుదేరిన నిర్మాలా సీతారామన్ కాన్వాయ్‌ను యువజన కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, భారీగా మోహరించారు.

Also Read : నేనే వచ్చి మోడీ ఫ్లెక్సీ కడుతా.. కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర మంత్రి సీరియస్

Advertisement

Next Story