చిత్రలేఖనంలో శ్వేతకు వండర్ ఉమెన్ అవార్డు

by Shiva |
చిత్రలేఖనంలో శ్వేతకు వండర్ ఉమెన్ అవార్డు
X

దిశ, నిజామాబాద్ సిటీ : నగరంలోని పద్మానగర్ కు చెందిన బింగివార్ శ్వేత చిత్రలేఖనంలో అద్భుత నైపుణ్యం, ప్రతిభ కనబరచినందకు గాను వండర్ ఉమెన్ అవార్డును ప్రదానం చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ అవార్డు వండర్ ఉమెన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ.. ఇంత చిన్న వయసులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్వేత భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆంకాంక్షించారు.

Advertisement

Next Story