మహిళలు ఆర్థికంగా ఎదగాలి

by Sridhar Babu |
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
X

దిశ, నవీపేట్ : బ్యాంకుల నుండి రుణాలు పొందిన స్వయం సహాయక బృందాల మహిళలు ఆర్థికంగా ఎదగాలని, రుణాలను సక్రమంగా వినియో గించుకొని వ్యాపారాలు చేయాలని బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బోధన్ లోని 3 బ్రాంచ్ లు, నవీపేట్ బ్రాంచ్ కు చెందిన స్వయం సహాయక బృందాలకు లోన్ ఉత్సవ్ పేరిట 11 కోట్ల రూపాయలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమం యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు డీజీఎం శంకర్ బ్యాంక్ సేవలను వివరాలను, బ్యాంక్ నుండి లోన్స్ పొందిన మహిళ సంఘాలు చేయవలసిన కార్యక్రమాలను వివరించారు. తదనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 632 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు ఇచ్చారని, ఈరోజు 11 కోట్ల రుణాలు అందిస్తున్న యూనియన్ బ్యాంక్ అధికారులను అభినందించారు.

డ్వాక్రా సంఘాల ద్వారా పొందిన రుణాల తో నూతన వ్యాపారాలు చేసేలా సలహాలు ఇవ్వాలని, నూతన ఉత్పత్తులు, వాటి మార్కెటింగ్ పై తగు సలహాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. గానుగ నూనె ఉత్పత్తి గురించి అవగాహన చేయించాలని తెలిపారు. విజయ డైరీ లో పాడి ఉత్పతిదారులకు లీటర్ పాలకు 70 రూపాయలు ఇవ్వాలన్నారు. గత ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాలకు 5 వేలు ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని, చదువుకున్న వారికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 20 వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళల బాధలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్వాక్రా సంఘాల స్కీం, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ సూచనల మేరకే ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచానని తెలిపారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అయ్యాయని, తన నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కోటి రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణాలు చేయిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇరిగేషన్ కాలువలను ఆధునికరించలేదని విమర్శించారు. అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం లో తానే చేశానని గుర్తు చేశారు. ఇప్పటికి 18 పంటలు వచ్చాయని తెలిపారు. కేంద్రంలో మోదీ సర్కారు పాలపై పన్నులు వేస్తుందని, ప్రతిదానికి పన్నులు వేస్తున్నారని అన్నారు.

మార్కులు తక్కువస్తే టీచర్ల పై చర్యలు

మార్చ్ లో జరిగే పదవ తరగతి పరీక్ష లో 80 శాతం కంటే తక్కువ ఫలితాలు వస్తే ఆయా టీచర్ల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని , విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story