- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడిక తీసేనా?
వానా కాలం నిండు గోదావరిలా కనిపించే శ్రీరాం సాగర్ ( పోచంపాడ్) ప్రాజెక్టు ఎండకాలం ప్రారంభంలోనే నీటి లేమితో వెలవెలబోతోంది. ఉత్తర తెలంగాణలో 16లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టు పూడిక కారణంగా దాదాపు 50టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోలేక వట్టిపొతోంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక వెలవెలబోతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 21.233 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఎలాంటి ఇన్ ఫ్లో కొనసాగకపోయినా అవుట్ ఫ్లో కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు నుంచి దిగువకు కాల్వల ద్వారా 1,294 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. గత ఏడాది వర్షాకాలం ప్రాజెక్టుకు జూన్ 1 నుంచి 591.833టీఎంసీల వరద వచ్చింది. అంతే స్థాయిలో 590.697టీఎంసీల నీటిని విడుదల చేశారు. 395టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా గోదావరిలోకి, 190 టీఎంసీల నీటిని కాల్వల ద్వారా వ్యవసాయానికి, కరెంటు ఉత్పత్తికి, తాగు నీటి అవసరాలకు (మిషన్ భగీరథ) కోసం విడుదల చేశారు. ఎండల తీవ్రత పెరగడంతో ప్రాజెక్టులో నీరు వేగంగా తగ్గిపోతోంది. గత ఏడాది ఇదే రోజు ప్రాజెక్టులో 27.550టీఎంసీల నీరు ఉండగా, బుధవారం 21.233టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే యాసంగి పంటలకు కాల్వల ద్వారా మరో పది రోజులు మాత్రమే నీటి విడుదల జరిగే అవకాశం ఉంది. దీంతో పంటలు గట్టెక్కే పరిస్థితి లేదు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో సామర్థ్యాన్ని 112టీఎం సీలుగా నిర్మించారు. దాని నిర్వహణలో ఆంధ్ర పా లకులు నిర్లక్ష్యం చేస్తూవచ్చారు. 1978లో చేప ట్టిన సర్వేలో 112టీఎంసీల మీరు నిల్వ చేయ వచ్చ ని లెక్కలు కట్టారు. అది 1994లో పూడిక ద్వారా 90టీఎంసీలకు నిలువ సామర్థ్యం పడిపో యింది. 2013- 14 సర్వే ప్రకారం 70టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులు నిల్వ ఉంటుందని మిగిలినవన్నీ ప్రాజె క్టు లెక్కలు మాత్రమేనని నివేదిక రూపొందించారు. ఆ నివేదికను బహిర్గతం చేయకపోవడంతో వందల టీఎంసీలు వరద రూపంలో ప్రాజెక్టుకు వస్తున్న పూడిక కారణంగా నిల్వ ఉండలేని పరిస్థితికి ప్రాజె క్ట్ చేరింది. ప్రతి ఏడాది గోదావరి, మంజీర నదులకు భారీస్థాయిలో వరదలు వస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు నీటి వరదకు కోరత లేదని చెప్పాలి. ఎందుకంటే వందల టీఎంసీల నీరు వస్తుంటే దానిని నీలువ సామర్థ్యం పెంపుదల పాలకులకు ఇష్టం లేదని చెప్పాలి. తెలంగాణ ఏర్పాటు అయ్యే వరకు గోదావరి నదిపై మహా రాష్ట్రలో 58చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులను కట్టివేసింది మహాసర్కార్. అసలే పూడికతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయి ప్రాజెక్టు కింద ఆయకట్టు సాగు వ్యవహారంపై నీలి నీడలు కమ్ముకోగా తెలంగాణ పాలకులకు దానిని తొలిగించాలనే అలోచన చేయలేదు. వరుణుడి కరుణతో ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా వరదలు ప్రాజెక్టును నిండడం ఒక్కటే ఉత్తర తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మెలని చెప్పాలి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద మట్టితో పుడుకపోవ డంతో దానిని తొలిగించాలని తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వం ఆలోచన చేయలేదు. సీఎం కేసీఆర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునర్ వైభవం తీసుకువచ్చేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి 2017ఆగస్టు 17న శంకుస్తాపన చేశారు. రూ. 1200 కోట్ల వ్యయంతో కాళేశ్వరం నీటితో శ్రీ రాంసాగర్ ను నింపాలని తలంచి జగిత్యాల జిల్లా మల్యాల మండలంకు 73 కిలో మీటర్ల పాయింట్ వద్ద తొలి పంపును, రెండో పంపును ఇబ్రహీంపట్నం రాజేశ్వర్ రావు పేట్ వద్ద, మూడో పాయిం ట్ ను ముప్కాల్ మండలం వరదకాలువ వద్ద 0 పాయింట్ లలో 8పంప్ ల ద్వారా కాళేశ్వరం జలాలను రోజుకు 1 టీఎంసీ చొప్పున ఎత్తిపోసేందుకు దానిని ప్రారంభించారు. ఏడాది కాలంలో పూర్తి కావాల్సిన ఈ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. ఇప్పటి వరకు ట్రయల్ రన్ లకు పరమితమై ఒక్క టీఎంసీని ఎత్తిపోయలేదు. కాని ప్రాజెక్టు అంచనా వ్యయం మాత్రం 1,900కోట్లకు పెంచారు. ప్రభుత్వం ఒకటి తలిచితే దైవం ఒకటి తలచిందన్నట్లుగా ఈ పథకం ప్రారంభించిన తరువాత ప్రతి ఏటా దండిగా వర్షాలు కురువడం గోదావరి, మంజీర నదుల ద్వారా వరదల రావడం తో ప్రాజెక్టుకు వందల టీఎంసీల వరద వస్తుంది. కాని వాటిని ఓడీసీ పట్టేందుకు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంపుధల రూ.30 నుంచి రూ.50 కోట్లు ఖర్చు చేసి పూడిక తీసిన 50టీఎంసీల నీల్వ సామర్థ్యం పెంచాలని ఇక్కడి పాలకులకు సోయిలేకుండా పోయింది. తెలంగాణలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టులను కలుపుతూ జలవనరుల శాఖ పేరిట పునర్ వ్యవస్థీకరణ చేశారు. కాని ఇంజినీరింగ్ అధికారులు ఇస్తున్న నివేదికలు బుట్టదాఖలు అవుతున్నాయి. అవసరం ఉన్న వాటికి రూపాయి విడుదలకు సవాలక్ష అడ్డంకులు కాగా ఒక్క టీఎంసీ నీటిని ఎత్తిపోయని పునరుజ్జీవంకు వందల కోట్లను ఇవ్వడంపై విమర్శలు ఉన్నాయి. మరి ఈ ఎండకా లం అయిన పూడిక విషయం ప్రభుత్వం, పాలకులు పట్టించుకుంటుందో లేదో చూడాలి.