కాంగ్రెస్ నాయకులు మసీదులు, చర్చిలపై ఒట్లు ఎందుకెయ్యరు?

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ నాయకులు మసీదులు, చర్చిలపై  ఒట్లు ఎందుకెయ్యరు?
X

దిశ, బోధన్ : రైతు రుణమాఫీ చేస్తామని హిందూ దేవాలయాలపై ఒట్లు వేస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మసీదులు, చర్చి లపై ఎందుకు వేయరని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బోధన్ నియోజకవర్గంలోని సాలూరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దేశంలో రామరాజ్యం రావాలంటే మరోసారి మోడీని గెలిపించాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తమ ప్రభుత్వం తెరిపిస్తుందని, దేశంలో ఇప్పటివరకు మూతపడిన 66 షుగర్ ఫ్యాక్టరీ లను పున:ప్రారంభించిన ఘటన బీజేపీదే అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన కొరకే నిజాం

షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ వేసిందని విమర్శించారు. మరో ఐదు సంవత్సరాలు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తామని తెలిపారు. మోడీ సర్కారు తీసుకున్న చర్యలతో ఆర్థికంగా దేశం బలపడిందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో గెలిచి యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను చూస్తే హిందూ సమాజం భయపడేలా ఉందని అన్నారు. రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఉపాధి హామీ డబ్బులు ఇవ్వకుంటే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, బోధన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed