- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూపీలో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుస్తుంది: ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమికి భారీగా మద్దతు లభిస్తోందని, వారణాసి మినహా అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. మంగళవారం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన అఖిలేష్ యాదవ్.. ఈసారి బీజేపీ ఎలాంటి వ్యూహాలు పన్నినా, యూపీ ప్రజలు వారిని రాష్ట్రం నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిని 'క్యోటో'గా అభివర్ణించిన ఆయన, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, బీజేపీ ఒక స్థానంలో మాత్రమే గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అది మోడీ పోటీ చేస్తున్న క్యోటో మాత్రమేనని అఖిలేష్ ఎద్దేవా చేశారు. జపాన్‌లోని క్యోటో నగరంగా వారణాసిని పర్యాటక ప్రదేశంగా మారుస్తానని ప్రధాని మోడీ గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఎన్నికలు ప్రారంభమైన సమయంలో బీజేపీ 400 సీట్ల నినాదాన్ని ముందుకు తెచ్చిందని, ఇప్పుడు ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈసారి దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు బీజేపీకి 140 సీట్లు కూడా ఇవ్వరు. 'మీరు బీజేపీ నేతల ప్రసంగాలు వినండి. వారు పాత కథనే చెబుతున్నారు. బీజేపీ అబద్దలు చెబుతుంది. వారు చేసిన ప్రతి వాగ్దానం అబద్దమే. వాటిని ఎవరూ వినేందుకు ఇష్టపడట్లేదు. ప్రజలు తమ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు. మా పీడీఏ(వెనుకబడిన, దళిత, మైనారిటీ) కుటుంబాలు ఎన్డీఏను ఓడిస్తాయని' అఖిలేష్ పేర్కొన్నారు.