- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు చోటేది..?
నేరుగా బస్టాండ్ లోకే.. ప్రైవేటు వాహనాలు
పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం
దిశ, జుక్కల్ : జుక్కల్ బస్టాండ్ ఒకప్పటి మంత్రి బషీరుద్దీన్ బాబు ఖాన్ ప్రారంభించారు. ఈ జుక్కల్ బస్టాండ్ త్రివేణి సంగమం బస్టాండ్ కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులు ఇక్కడి వస్తాయి. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు దేగ్లుర్ నుంచి జుక్కల్ వరకు రాకపోకలు కొనసాగుతాయి.
ఆ విషయం అటుంచితే.. సరిగ్గా బస్టాండ్ ఎదుటే ప్రైవేటు వాహనాలు నిలుపుతుండడంతో ప్రయాణికులు ఆ వాహనాల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ ఆదాయానికి కూడా గండి పడుతోంది. బోధన్ డిపో చెందిన బస్సు ఔరాద్ వరకు తిరిగి బోధన్ వరకు నడుపుతున్నారు.ఈ బస్సులు బస్టాండ్ కు వచ్చే సమయంలోనే ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రయాణికులను వారి వాహనాల్లో తీసుకెళ్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
ఇంత జరుగుతున్నా.. ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు మీన, మేషాలు లెక్కిస్తున్నారు. ప్రైవేటు వాహనాలను బస్టాంట్ ఎదుట నిలపకుండా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ లో వెంటనే కంట్రోలర్ ను ఏర్పాటు చేసి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.