ఆపదలో ఉన్నప్పుడు కుయ్‌.. కుయ్‌ మంటూ రివ్వున వస్తున్న..రియల్ హీరోస్

by Naveena |   ( Updated:2024-10-27 10:42:59.0  )
ఆపదలో ఉన్నప్పుడు కుయ్‌.. కుయ్‌ మంటూ రివ్వున వస్తున్న..రియల్ హీరోస్
X

దిశ, గాంధారి:ఆపదలో ఉన్నప్పుడు ప్రమాదాల బారిన పడి సాయం కోసం ఎదురు చూస్తుంటే..కుయ్‌.. కుయ్‌ మంటూ రివ్వున వచ్చి ప్రాణాలు కాపాడుతారు. ఎవరు వచ్చినా రాకున్నా ఆపద వచ్చిందంటే చాలు..మేమున్నామంటూ 108, 102 సిబ్బందులు ముందుండి ఆసుపత్రి వరకు తరలిస్తారు. అలాంటి వారు నిజంగానే రియల్ హీరోస్. రోడ్డు ప్రమాదాలు,గర్భిణీలు, పాము కరిచిందని, జలుబు జ్వరంతో బాధపడుతున్నామని, లేచి నడవలేని స్థితిలో ఉన్నామని ఒక్క ఫోన్ చేస్తే..ఆపద కాలంలో ఆదుకునే బంధువుల కంటే ముందు ఉంటారంటే అతిశయోక్తి కాదు.

నాలుగు నెలల్లో 526 మంది కాపాడిన ప్రాణదాతలు....

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో 108,102 సిబ్బంది నాలుగు నెలల్లో 526 మంది ప్రాణాలు కాపాడారు. దీంతో స్థానికులు 108,102 సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.సిబ్బంది కాపాడిన వారిలో గర్భిణీ ప్రసవ కేసులు 204, పురుగుల మందు కేసులు 30, రోడ్ ప్రమాదాల కేసులు 30, ఛాతి నొప్పి కేసులు 32, పాము కాటు కేసులు15, ఫీవర్ కడుపు నొప్పి -215 ఎమర్జెన్సీగా హాస్పిటల్కు చేర్చడంతో పాటు.. అంబులెన్సు డెలివరి లోనే దాదాపు 101 గర్భిణీ స్త్రీలకు కాన్పులు నిర్వహించి..తల్లి బిడ్డ క్షేమంగా సమీప ఆసుపత్రికి చేర్చిన సంఘటనలు చాలానే ఉన్నాయని స్థానికులు తెలిపారు.

102 గర్భిణి స్త్రీల కోసమే.....

102 బాలింతల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పీహెచ్‌సీలు( PHC ),ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి..ప్రసవం జరిగిన తర్వాత తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చడానికి 102 వాహనాలను అందుబాటులో ఉంటాయని ప్రోగ్రాం మేనేజర్ తెలిపారు . 102కి కాల్‌ చేసిందే తడవుగా సదరు గర్భిణి ఇంటి ముందు వాహనం వాలిపోతుందన్నారు. ఆమెకు తోడుగా ఆశ కార్యకర్త ఉంటారన్నారు.24 గంటలపాటు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నామన్నారు.

24 గంటలు అందుబాటులో ఉంటాయి-ప్రోగ్రాం మేనేజర్ తిరుపతి

108,102 సేవలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రోగ్రాం మేనేజర్ మధు అన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా పైలెట్,ఈఎంటి లు గాంధారి మండల ఇంచార్జ్ తిరుపతి అందుబాటులో ఉంటారని తెలిపారు. గాంధారి మండలానికి ఏ సమయంలోనైనా ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed