- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా వాటా ఎంత
దిశ, గాంధారి : సర్పంచులు నన్ను చావగొడుతున్నారు... జర మేజర్ గ్రామపంచాయతీలను చూసుకోరాదే... అని కేటీఆర్ ను ఎమ్మెల్యే అడగడమే ఆలస్యం వెంటనే రూ.25 కోట్ల నిధుల జీవో విడుదల చేస్తూ ఎమ్మెల్యేకు జీవో కాపీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఆగస్టు 14న ఎల్లారెడ్డిలో జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐటీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు రూ.25 కోట్ల జీవో కాపీ సభా సాక్షిగా ఇచ్చారు. గాంధారి, తాడ్వాయి మండలాల అభివృద్ధి కొరకు అదనంగా నిధుల వర్షం కురిపించారు.
అయితే రూ.25 కోట్లలో గాంధారి వాటా ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. జీవో అమల్లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గాంధారి కి వచ్చే రూ.25 కోట్ల నిధులలో మేజర్ గ్రామపంచాయతీకి సరైన న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు స్థానిక సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ ఇది వరకే తెలిపారు. ఒకవేళ నిధులు విడుదలైతే సంఘం రేవు బ్రిడ్జి, పోచమ్మ రేవు బ్రిడ్జి, డ్రైనేజీ వ్యవస్థ, 50 లక్షల బీటీ రోడ్డు ప్రధాన రహదారి నుండి సుభాష్ బొమ్మ వరకు ప్రతిపాదనలు ఉన్నట్టు సర్పంచ్ వెల్లడించారు. ఈ జీవో కొరకే ఎమ్మెల్యే సచివాలయానికి వెళ్లినట్లు సర్పంచ్ తెలిపారు. అతి త్వరలోనే నిధులు విడుదలవుతాయని, అభివృద్ధిలో గాంధారి ముందంజలో ఉంటుందని సర్పంచ్ తెలిపారు.