లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పునరుద్ధరణ పై మంత్రి ఉత్తమ్‌ని కలిసిన వినయ్ రెడ్డి

by Mahesh |
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పునరుద్ధరణ పై మంత్రి ఉత్తమ్‌ని కలిసిన వినయ్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పునరుద్ధరణ కోసం, కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల విషయమై శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శనివారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లోని పలు మండలాల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పునరుద్ధరణ పై, కొత్త లిస్టులను మంజూరు చేయాలని కోరుతూ టెండర్లు పిలవడంపై ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలపై నందిపేట్ మండల కేంద్రంలోని నికాల్పూర్, మరంపల్లి, తల్వేద, వన్నెల్ (కే) పనుల పునరుద్ధరణ కోసం 4.83 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఈ పథకాల ఆయకట్టు కింద 1,4056 ఎకరాలు లబ్ధి చేకూరుతుందన్నారు.

వీటికి టెండర్లు పిలిచారని, కానీ అగ్రిమెంట్లు కుదరకపోవడంతో ప్రభుత్వం నుంచి మంజూరు కోరుతున్నట్లు తెలిపారు. ఆర్మూర్ మండలం మచ్చర్ల లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణంతో 2860 ఎకరాల ఆయకట్టు రూపొందించేందుకు ఈ పథకం ద్వారా 40.40 కోట్లు టెండర్లు పిలిచి ఏజెన్సీని ఖరారు చేయలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని 2860 ఎకరాల ఆయకట్టుకు ఈ పథకం దోహదపడుతుందని వివరించారు. అలాగే బినోల, కంఠం, చిక్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్, నందిపేట్, నందిపేట్ మండలంలోని ఎస్సారెస్పీ ముందు భాగంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణానికి 79.85 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ పథకం ద్వారా మాక్లూర్, నందిపేట్ మండలాల్లోని 5155 ఎకరాల ఆయకట్టుకు పథకం దోహదపడుతుందని తెలిపారు.

ఈ పథకం ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతున్నట్లు చెప్పారు. ధర్మోరా లిఫ్ట్ ఇరిగేషన్ పథకంతో (గుత్ప అదనపు పథకం) ద్వారా మాక్లూర్ మండలం ధర్మోరాలోని 1000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు 11.71కోట్లతో నిజామాబాద్ జిల్లా పై లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణం మంజూరు అయ్యిందని, కానీ ఈ పథకం పనులు 50 శాతం పూర్తయ్యాయని, మిగతా పనుల నిర్మాణం కోసం ప్రభుత్వం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కంబైండ్ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్త పథకాన్ని ఆర్మూర్ మండలం ఫతేపూర్ సమీపంలోని ఎస్సారెస్పీ ఫోర్ షోర్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేపడితే పత్తేపూర్ లో 3700 ఎకరాలు, చిట్టాపూర్ లో 3474 ఎకరాలు, సుర్బిర్యాల్ గ్రామాల్లో 2040 ఎకరాల వద్ద ఆయకట్టుకు నీరు అందుతుందని, ఈ పథక నిర్మాణం ఒప్పందం కుదిరి 18 నెలలు గడుస్తున్న పనులు నెమ్మదిగా సాగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతోపాటు నిజామాబాద్ జిల్లా గుత్ప బ్యాలెన్సింగ్ ట్యాంక్ (మునుపెల్లి లిఫ్ట్) పై కొత్త పథకం ద్వారా స్కీం నిర్మాణానికి 23.80 కోట్ల ప్రభుత్వ పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చిందని చెప్పారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మాక్లూర్, ఆర్మూర్, జక్రన్ పల్లి మండలాల్లోని 2423 ఎకరాల ఐడి పంటలకు నీరు అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. అయితే అటవీ అనుమతుల కోసం ఏజెన్సీ గత 3 సంవత్సరాల నుండి పనులను నిలిపివేసిందని, స్టేజి 1 క్లియరెన్స్ లభించిందని, అటవీశాఖ అభివృద్ధి చార్జీల బిల్లు నిజామాబాద్ ఏపీఏఓ వద్ద 13.21 లక్షలు పెండింగ్లో ఉన్నాయని వాటి మంజూరు విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని మంత్రిని ఆయన కోరారు. నియోజకవర్గంలోని కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల మంజూరు పెండింగ్లో ఉన్న పనుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఆయన మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed