దళిత బంధులో అవినీతి జరుగుతుంది.. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి ఆరోపణ

by Sumithra |
దళిత బంధులో అవినీతి జరుగుతుంది.. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి ఆరోపణ
X

దిశ ప్రతినిది, నిజామాబాద్ : దళితబంధు పథకంను అర్హులైన దళితులకు అందించడంలో ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన వద్ధ ఉందని సీఎం కేసీఆర్ బహిరంగంగా ప్లీనరీలో ప్రకటించి కలకలం రేపినవిషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో బీఆర్ఎస్ పార్టి గ్రామ అధ్యక్షుడు ఒకరు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో దళితబంధు ఇప్పిస్తామని కొందరు నాయకుల వసూళ్ల వ్యవహరం పై మాట్లాడిన విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దళిత బంధువులు అవినీతి జరుగుతుందని దానికి బీఆర్ఎస్ నాయకులకు ఇందులో హస్తముందని ఆరోపించాడు. దళిత బందు సంబంధించిన అవినీతి చిట్టా తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా నాగులూర్ చెందిన సాయిలు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అవినీతికి పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని అన్నాడు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే టైం ఇస్తే దళిత బందులో జరిగిన అవినీతి ఆధారాలతో సహా నిరూపిస్తానని అనడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇకనైనా అధికారుల పై, నాయకుల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఎట్టి పరిస్థితుల్లో ఎంత వారైనా తగు చర్యలు తీసుకుంటానని చెప్పిన సంఘటన మరొకసారి నాగులూర్ సాయిలు గుర్తు చేశాడు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశ పెడితే వాటిని ఇప్పిస్తామని పేదల వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. బంగారం తాకట్టు పెట్టి, అప్పు సోప్పు చేసి లీడర్ల చేతికి అందిస్తే దళిత బంధు ఇప్పియకుండా, వారికి దొరకకుండా, సెల్ ఫోన్ చేసినా ఎత్తకుండా వారిని నానా తిప్పలు పెడుతున్నారని సాయిలు విడియోలో వాపోయాడు. దళిత బంధు ఇప్పిస్తామని లీడర్లు వసూళ్ళు చేయ్యడమే కాకుండా డబ్బులు తీసుకున్న అడియో రికార్డింగ్ లు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఇకనైనా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విడియో ఇప్పుడు ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లాలో సోషల్ మీడియాల్ హల్ ఛల్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed