చమ్మక్ చంద్రను కలిసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి..

by Sumithra |
చమ్మక్ చంద్రను కలిసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి..
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం వెంకటాపూర్ గ్రామానికి వెళ్లిన సమయంలో తన సొంత గ్రామంలో జబర్దస్త్ స్టార్ట్ చమ్మక్ చంద్రను ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో మంగళవారం నర్సాపూర్, ముదేల్లి, మొండి సడక్, వెంకటాపురం, సర్వాపూర్, గౌరారం, సితాయిపల్లి, చెన్నాపూర్ గ్రామపంచాయతీలో భారత్ జొడో యాత్ర అనుసంధానంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

రాహుల్ గాంధీ సందేశాన్ని గ్రామగ్రామాన ప్రతి గడపగడపకు తెలియజేయాలని ఉద్దేశంతో పల్లెపల్లెకు కాంగ్రెస్, గడపగడపకు సుభాష్ అన్న కార్యక్రమంలో కాంగ్రెస్ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ప్రజల నుండి వస్తున్న అపూర్వస్పందనకు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తనని కాకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని గడపగడపకు వెళ్లికాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, గాంధారి మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story