ఇంటికో ఉద్యోగం ఏమాయే..?

by Sumithra |
ఇంటికో ఉద్యోగం ఏమాయే..?
X

దిశ, గాంధారి : భారతీయ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చే ముందు వరాల జల్లు కురిపించి అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటలు ఏమయ్యాయని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అధికార ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, లక్ష రుణమాఫీ, దళితుడే ముఖ్యమంత్రి అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజాసమస్యలను గాలికి వదిలేస్తున్నారని అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెరాస పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యే జాజాల సురేందర్ అని ఏద్దేవ చేశారు.

గ్రామగ్రామాన ఎక్కడ చూసినా ఇంద్రమ్మ ఇల్లు కనబడుతున్నాయి. కానీ మీరు చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కనబడడం లేదని పేదోడి సొంతింటి కల కళగానే మారిందని తొందర్లోనే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. హత్ సే హత్ జోడో కార్యక్రమానికి ఇంత ఆదరణ కల్పిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటాయని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. ప్రతిగ్రామంలో గడపగడపకు తిరుగుతూ టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ యాత్రను కొనసాగించనున్నారు.

13 రోజులకు చేరిన యాత్ర గాంధారి మండలంలోని చిన్నపోతంగల్, పెద్దపోతంగల్, మేడిపల్లి, చిన్నాపూర్, సితాయపల్లి, గండిపేట్, తండా గండిపేట్ గ్రామాల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కమెల్లి బాలరాజ్, లైన్ రమేష్, ఎండీ మదర్, రవి, సంతోష్ ,రమేష్, భాస్కర్, గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed