ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు దుర్మరణం

by Sridhar Babu |
ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు దుర్మరణం
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్లోని మోర్ సూపర్ మార్కెట్ దగ్గర 63 నంబర్ జాతీయ రహదారిని గుర్తు తెలియని వృద్ధుడు దాటుతుండగా అటువైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. వృద్ధుడి వయస్సు సుమారు 65 నుండి 70 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి జాతీయ రహదారిని దాటుతుండగా ఆర్మూర్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వృద్ధుడి తలకు, కాళ్లకు ఇతర భాగాలకు బలమైన గాయాలు కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి గురించి ఆచూకీ తెలిసినవారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ రవికుమార్ తెలిపారు.

Advertisement

Next Story