పంద్రాగస్టు వేడుకల్లో ఆకట్టుకున్న రెండు ప్రదర్శనలు

by Sridhar Babu |
పంద్రాగస్టు వేడుకల్లో ఆకట్టుకున్న రెండు ప్రదర్శనలు
X

దిశ, భిక్కనూరు : రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు విష సర్పాలు వారి దరిచేరకుండా ఫార్మర్ బాటన్ అడ్డుకుంటుందని విద్యార్థులు తెలిపారు. అలాగే 200 కేజీల బరువును ఒకచోటి నుంచి మరోచోటికి ఈజీగా తరలించే మరో పరికరం కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రధానంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ కౌన్సిల్( టీఎస్ ఐ పీ ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనకు భిక్కనూరు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నుండి రెండు ప్రదర్శనలు ఎంపికయ్యాయి. మల్టీ పర్పస్ ఈజీ క్యారియర్ అనే పరికరాన్ని మాస్టర్ తమ్మల రాజు ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థి సుమధీర్ రూపొందించగా ఎంతగానో ఆకట్టుకుంది. 200 కేజీల బరువు గల వస్తువులు ఒకచోటి

నుంచి మరోచోటికి ఈజీగా తరలించొచ్చని, ఇదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఫార్మర్ బాటన్ అనే పరికరాన్ని ప్రదర్శించి తద్వారా జరిగే ప్రయోజనాలను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వివరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఈ పరికరం ఉన్న చోటు నుంచి 10 మీటర్ల దూరంలో, దాని ద్వారా వచ్చే కంపనాల వల్ల ఎలాంటి విష సర్పాలు రైతుల వద్దకు చేరకుండా చేస్తుందని తెలిపారు. ఈ రెండు ప్రదర్శనలు ఆకట్టుకోవడంతో తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వా న్, ఎస్నీ సింధు శర్మ, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియల చేతుల మీదుగా ఇన్నోవేషన్ అవార్డులు అందుకున్నారు. రెండు ప్రదర్శనలకు అవార్డులు రావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనాథ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు వారికి అభినందనలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed