సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు.. ఏమైందో తెలుసా..

by Sumithra |
సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు.. ఏమైందో తెలుసా..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడివి మామిడిపల్లి ఉర చెరువులో ఈతకు దిగి ఇద్ధరు చిన్నారులు గల్లంతయ్యారు. ఈ సంఘటన సోమవారం మద్యహ్నం జరిగింది. అడివి మామిడిపల్లికి చెందిన బోల్లి రాజేష్ (13), పట్టేవార్ అఖీల్ ( 14) లు స్నేహితులు. దసరా సెలవులు కావడంతో ఉర చెరువులో ఈత కొట్టడానికి దిగి గల్లంతయ్యారు. గ్రామస్ధులు గమనించి కాపాడేందుకు యత్నించిన వారు నీట మునిగి చనిపోయారు.

రాజేష్ 7 వ తరగతి చదువుతుండగా, పట్టేవార్ ఆఖీల్ 9 వ తరగతి చదువుతున్నట్టు తెలిసింది. మాక్లూర్ పోలిస్ లు కేసు నమోదు చేసి మృత దేహాలపే ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. సద్ధుల బతుకమ్మ రోజు అడివి మామిడి పల్లిలో ఇద్ధరు చిన్నారులు చెరువులో మునిగి దుర్మరణం చెందడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సంఘటన స్థలానికి నార్త్ రూరల్ సీఐ నరహరి, ఎస్సై చేరుకుని వివరాలను సేకరించారు.



Advertisement

Next Story