- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు..
దిశ, కామారెడ్డి : జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 16న ఉదయం 11 గంటల నుండి తేది 18న ఉదయం 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి రాకపోకలు దారిమల్లించినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్టేషన్ రోడ్, సిరిసిల్లా రోడ్, సుభాష్ రోడ్, పెద్ద బజార్, పాంచ్ రస్తా, వీక్లీ మార్కెట్ రోడ్డు, జే పి ఎన్ రోడ్, తిలక్ రోడ్ లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రయాణికులు, కామారెడ్డి పట్టణంలోకి వచ్చేవారు తాము సూచించిన విధంగా ప్రయాణం చేసి పోలీస్ వారికి సహకరించాలని కోరారు. నిజాంసాగర్ చౌరస్తా నుండి స్టేషన్ రోడ్డు వైపుకు భారీ వాహనాలు అనుమతించ బడవన్నారు.
చిన్న వాహనాలు అవసరాన్ని బట్టి మాత్రమే, వారి నివాసాలకు వెళ్లే విధంగా అనుమతించబడుతుందన్నారు. సిరిసిల్ల రోడ్డు పై మాచారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలను, సిరిసిల్ల బ్రిడ్జి వద్ద ఎన్ హెచ్ 44 వైపుకు మళ్ళించబడుతుందన్నారు. రామారెడ్డి, గర్గుల్ నుంచి వచ్చే వాహనాలను, గుమాస్తా కాలనీ వద్ద జిల్లా పోలీస్ కార్యాలయం వైపు మళ్ళించ బడుతుందన్నారు. అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద నుండి పట్టణము లోపలికి వచ్చే వాహనాలను, కొత్త బస్టాండ్ వైపుకు మళ్ళించ బడుతుందన్నారు. ఆర్టీసీ బస్సులను కొత్త బస్టాండ్ వద్ద నుంచి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు వారి ప్రయాణాలను కొత్త బస్టాండ్ వద్ద నుండి మాత్రమే కొనసాగించాలని కోరారు.