శంకుస్థాపన కార్యక్రమంలో చిందేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు..

by Sumithra |
శంకుస్థాపన కార్యక్రమంలో చిందేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు..
X

దిశ, గాంధారి : శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్మోహన్ రావ్ గిరిజన వాసులు కోరిక మేరకు డాన్స్ వేసి అందరిని అలరించారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మాధవ్ పల్లి, గుడిమేట్, పంతులు నాయక్ తండ, కరక్ వాడి, బూర్గుల్, తిప్పారం, తిప్పారం తాండ, గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ మీకు ఎలాంటి సమస్యలున్న ఆదుకోవడానికి ఆపన్నాస్తంగా నేను ముందుంటా అని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు పరిచే కార్యక్రమాల గురుంచి గ్రామ ప్రజలకు వివరించారు.

ఆదేవిదంగా నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్ నియోజకవర్గ ప్రజలకు చేసనిన మోసాలను, వైఫల్యాల్ని గ్రామప్రజల సమక్షంలో ఎండగట్టారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా విఫలం అయ్యింది అని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల నుండి స్వాగతం పలకడంతో చాలా సంతోషంగా ఉందని తనసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాబోయేది ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. శ్రీసంత్ సేవలాల్ మహారాజ్ ఆలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, గాంధారి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story