- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాకపోకలు ప్రారంభమయ్యే దెన్న డో...?
దిశ, భిక్కనూరు : మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి వెళ్లాలంటే చుట్టూ 18 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఆ గ్రామస్థులకు నెలకొంది. పొద్దున లేస్తే చాలు వివిధ పనుల కోసం పక్కనే ఉన్న భిక్కనూరు మండల కేంద్రానికి రావాల్సిన తిప్పాపూర్ గ్రామస్తులు అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల వలన మూడు నెలలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, భిక్కనూరు, తిప్పాపూర్ గ్రామాల మధ్య ఎలాగోలా రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఆటోలు, ట్రాక్టర్లు, వ్యాన్లు లారీలు, స్కూల్ బస్సులు తిరిగి తిప్పాపూర్ గ్రామానికి వెళుతున్నాయి.
ఆయా వాహనాల ద్వారా ఇంటి నిర్మాణ దారులు, రైతులు, ప్రయాణికులు చార్జీలు రెట్టింపవ్వడంతో పాటు, గ్రామానికి వెళ్లేందుకు సమయం పడుతుండడంతో లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలు కాగానే గ్రామానికి వెళ్లేందుకు మహిళలతో పాటు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, దీనికితోడు ప్రతిరోజు వర్షాలు కురవడం నిర్మాణ పనులకు అడ్డంకిగా మారాయి. అయితే గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టర్ రామేశ్వర్ పల్లి పలుగు గుట్ట నుండి, రైల్వే గేటు మీదుగా గ్రామం వరకూ మూడు లక్షలతో టెంపరరీ రోడ్డు నిర్మించేందుకు 100 ట్రిప్పుల మొరం కొట్టించారు.
అయితే కురిసిన వర్షాలకు మొరం కొట్టుకుపోవడం, పనులు సాగక పోవడంతో చేసిన పని వృధా అయ్యింది. దీంతో గ్రామస్తులు ఈ రోడ్డు పై పెంచుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం పూర్తయిన బ్రిడ్జి నిర్మాణం కిందినుంచి ఒక సైడ్ పనులు కొనసాగిస్తూనే, మరో సైడ్ నుంచి రాకపోకలు జరిగే విధంగా చూడాలని గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు సదరు కాంట్రాక్టర్ కు సూచించారు. అయితే ఆ విధంగా పనులు చేయడం సాధ్యమవుతుందా...? లేదా అన్న విషయమై సదరు కాంట్రాక్టర్ తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.