ఆర్మూర్ లో మూడిండ్లలో చోరీలు

by Sridhar Babu |
ఆర్మూర్ లో మూడిండ్లలో చోరీలు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ లో గల 21, 22 మున్సిపల్ వార్డులలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు మూడు ఇండ్లలో చోరీ చేశారు. 21, 22వ మున్సిపల్ వార్డుకు చెందిన క్లాసిక్ ఫంక్షన్ హాల్ కు చెందిన నయీముద్దీన్ ఇంటి గోడను దూకి ఇంట్లో చొరబడి సుమారు రెండు లక్షల రూపాయల నగదును, పది తులాల బంగారంతో పాటు విలువైన బట్టలు కూడా ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయారు. 22వ వార్డుకు చెందిన షబానా బేగం ఇంట్లో 80 వేల నగదు, ఒక తులం బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అదే వార్డులోకి చెందిన గంగుబాయి ఇంటి తాళం పగలగొట్టి చోరీకి ప్రయత్నం చేయగా ఆ శబ్దానికి పక్కింటి వారు వచ్చి అరవడంతో కొన్ని వస్తువులు దొంగిలించి పరారయ్యారు.

Advertisement

Next Story