డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో దొంగలు పడ్డారు..

by Sumithra |
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో దొంగలు పడ్డారు..
X

దిశ, బోధన్ : బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాధనంతో అసంపూర్తిగా నిర్మించి ప్రజలకు పంపిణీ చేయని డబుల్ బెడ్ రూమ్ లలో దొంగలు పడుతున్నారు. ఎడపల్లి మండలం ధర్మారం శివారులో నిర్మించి పంపిణీ చేయని 30 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోని సామగ్రి చోరీకి గురైంది. కాంగ్రెస్ నాయకులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై తమకే సర్వహక్కులు ఉన్నట్లు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నేతలు వాటికి సంబంధించిన సామాగ్రిని దొంగిలించడం, సొంత సొత్తు మాదిరి కాజేయడం సమంజసం కాదన్నారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సుండు నర్సయ్య మాట్లాడుతూ నాయకులే కాంట్రాక్టర్ లుగా మారి గ్రామంలో నాణ్యత లేని డబుల్ బెడ్ రూంలు నిర్మించి అర్హులైన ఏ ఒక్కరికీ కేటాయించకుండా కాలయాపన చేసి సామాగ్రిని దొంగిలించిన బీఆర్ఎస్ నాయకుల పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూంలను తమ ఆధీనంలోకి తీసుకొని, అర్హులైన నిరుపేదలకు అందజేయాల్సిన బాధ్యత తహశీల్దార్ పై ఉందని, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నవారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుండు లక్ష్మి, మాజీ సర్పంచ్ మల్లెపూల సావిత్రి, బూత్ కమిటీ అధ్యక్షులు గణేష్ గౌడ్, చందూర్ అశోక్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు, సుండు యాదగిరి, మల్లెపూల రాజేశ్వర్ గౌడ్ గ్రామ ఉపాధ్యక్షులు,సీనియర్ నాయకులు నరసయ్య, పూన భూమయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story