పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అంతే సంగతి..

by Sumithra |
పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అంతే సంగతి..
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో శుక్రవారం ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి ఇవ్వబోరని చెప్పారు. ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, పరీక్షల విభాగం అధికారులు అజ్మల్ ఖాన్, నిజాం పాల్గొన్నారు.

ధరణి టౌన్షిప్ ప్లాట్లకు 16 నుంచి 21 వరకు వేలం పాట..

ధరణి టౌన్షిప్ లో ఉన్న ప్లాట్లు, గృహాలకు మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం ధరణి టౌన్షిప్ ఫ్రీ బిడ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ వేలంపాటలో పాల్గొనేవారు కలెక్టర్, కామారెడ్డి పేరున రూ.10 వేలు డీడీ చెల్లించాలని తెలిపారు.

వేలంలో పాల్గొనే వ్యక్తులు తమవెంట ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వంటి గుర్తింపుపత్రాలు తీసుకురావాలని చెప్పారు. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన రామారెడ్డి రోడ్లో డీటీసీపీ లే అవుట్ లో ప్లాట్లు, గృహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో పర్యవేక్షకులు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed