- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాచారం లేదు - సమావేశం చెల్లదు
దిశ, మాక్లూర్ : మాక్లూర్ సొసైటీ కార్యాలయ ఆవరణలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన నాలుగు ఏళ్లలో సొసైటీలో జరిగిన అక్రమాలు, వివాదాల అంశాలతో 85వ మహాజన సర్వసభ్య సమావేశం సభ్యుల ఆగ్రహంతో రసాభాసగా మారింది. చైర్మన్ అశోక్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశంలో ముందుగా కార్యదర్శి ప్రవీణ్ జమా ఖర్చుల వివరాలను చదివి వినిపించారు. అనంతరం గ్రామాల్లో ఉన్న సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నామని తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అలాగే గతంలో జరిగిన విచారణలో తేలిన బకాయి సొమ్మును ఎప్పుడు వసూలు చేస్తారో స్పష్టం చేయాలని భీష్మించారు. దీంతో అశోక్ కలుగజేసుకుని త్వరలోనే పక్కదారి పట్టిన సొమ్మును సొసైటీకి జమచేస్తామని హామీ ఇచ్చారు. సభ్యులెవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అన్నదాతలు సహకరించి సొసైటీ అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ లింగరావు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.