ఎన్నికలు బహిష్కరించిన పిప్పిర్యాగడి తండా వాసులు

by Sridhar Babu |
ఎన్నికలు బహిష్కరించిన పిప్పిర్యాగడి తండా వాసులు
X

దిశ,నిజాంసాగర్ : మా తండాలో కనీస వసతులు కల్పించని నాయకులకు మేము ఓటు వేయం అని పార్లమెంట్ ఎన్నికలను తండా వాసులు బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని పిప్పిర్యాగడి తండా వాసులు మేము ఓటు వేయం అని భీష్మించుకుని కూర్చున్నారు. మా తండాని పట్టించుకున్న నాయకుడు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయకుండా కనీస వసతులు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు నీరు, వీధి దీపాలు, రోడ్డు, మురుగు కాలువలు, స్కూల్ లో

ఉపాధ్యాయుల కొరతతో అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ గంగాధర్, ఎస్ఐ సుధాకర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని తండా వాసులతో మాట్లాడి సముదాయించారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ 11 గంటలు దాటినా ఒక్కరు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు తక్షణమే తాగు నీరు, విద్యుత్ దీపాలు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఓటు వేసేందుకు అంగీకరించారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. తండాలో మొత్తం 153 మంది ఓటర్లు ఉన్నట్లు తహసీల్దార్ భిక్షపతి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed