- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"దిశ" కు కృతజ్ఞతలు.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్న సభ్యులు..
దిశ, భిక్కనూరు : అసోసియేషన్ కు సంబంధించిన విలువైన స్థలంలో పాత సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ హక్కు ఉంటుందని కిరాణా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీరాం చంద్ర శేఖర్ గుప్తా స్పష్టం చేశారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలోని నగరేశ్వరాలయంలో అసోసియేషన్ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లో ఆ ఏడుగురు పేర్లు ఎందుకు అన్న శీర్షికన దిశ వెబ్ సైట్ లో వచ్చిన వార్త వాట్సాప్ గ్రూపుల్లో గిరికలు కొట్టింది. దీనికి స్పందించిన అసోసియేషన్ సభ్యులు కిరాణాషాపులు మూసి వేసుకొని అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్నసభ్యులతోపాటు, పాత సభ్యులు ఏడుగురి పై రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకుంటారన్న విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా పాత మాజీ అధ్యక్షుడు శ్రీరాం చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ సంఘం ఏ ఒక్కరి సొంతం కాదని, అప్పుడు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారందరికీ స్థలంపై హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆ స్థలాన్ని పెట్రోల్ బంకు కు లీజుకిచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఇందుకోసం ఓ కమిటీని వేసి, వారి ఆధ్వర్యంలో బంకు లీజుకిచ్చే బాధ్యతను అప్పగిస్తామన్నారు. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో సంఘం డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తామన్నారు. ఈ ప్రకటనను సమావేశానికి హాజరైన సభ్యులు ప్రతి ఒక్కరు స్వాగతించారు. కాగా పాత సభ్యులైన మీరెందుకొచ్చారని ప్రస్తుత సభ్యులు కొందరు వారిని ప్రశ్నించగా అసోసియేషన్ స్థలం పై "దిశ "వెబ్ సైట్ లో వచ్చిన వార్తను చూసే ఇక్కడికి వచ్చామని ధైర్యంగా చెప్పగా, పేపర్లో వార్త వచ్చేదాకా ఈ విషయం తమకు తెలియదని మరికొందరు స్పష్టం చేశారు. అయితే ఈ విషయం ఇక్కడికిక్కడే ముగిసిపోవడంతో సంఘం సభ్యులు "దిశ " కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.