అటవీ అధికారుల పై దాడికి వెనకాడని కబ్జాదారులు..

by Sumithra |
అటవీ అధికారుల పై దాడికి వెనకాడని కబ్జాదారులు..
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలో మళ్లీ అటవీ భూముల అన్యాక్రాంతం మొదలైంది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డీఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 70 మంది పోలీసుల రక్షణలో అటవీ శాఖ అధికారులు ఆక్రమిత అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్విన ఘటన సంచలనం రేపింది. రెండు రోజుల కిందట అటవీ అధికారులకు ఎల్లంపేట పరిధిలోని నడిమితాండ అటవీ ప్రాంతంలో అటవీ భూమి అన్యాక్రాంతమవుతుందన్న సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని సందర్శించడంతో అటవీ శాఖ అధికారులకు ఆక్రమిత దారులకు మధ్యల వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది.

దీంతో అక్కడి నుంచి అటవీ అధికారులు తిరిగివచ్చి ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించారు. దీంతో డీఎఫ్ఓ ఎస్పీతో మాట్లాడి పోలీస్ భద్రత మధ్య గురువారం ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత దారులపై అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అటవీ భూములకు పోడు పట్టాలు ఇవ్వడంతో కబ్జాదారుల్లో ఆశలు పెరిగిపోయి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed