ఫేస్‌పై వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా? బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తోన్న 6 ఫ్రూట్స్

by Anjali |
ఫేస్‌పై వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా? బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తోన్న 6 ఫ్రూట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వయసు పెరిగినా కానీ చర్మం యవ్వనంగా కనిపించాలని చాలా మంది కోరిక. కానీ పోషకాహార లోపం కారణంగానో, కాలుష్యం వల్లనో ఫేస్ చర్మంపై గీతలు పడి వృద్ధాప్యాన్ని ముందే ఆహ్వానిస్తుంది. ఇందుకు చాలా మంది ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతుంటారు. కానీ ఫలితం ఉండదు. కాగా యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ ఏడు రకాల పండ్లను ప్రతిరోజూ తింటే వృద్ధాప్య సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బొప్పాయి పండు..

ఫాస్పరస్, క్యాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బొప్పాయి పండు తీసుకుంటే చర్మాన్ని ముడతల నుంచి కాపాడుకున్న వారు అవుతారు. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో చర్మం డామేజ్ కాకుండా రక్షిస్తుంది.

దానిమ్మ పండు..

దానిమ్మ గింజలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచూ వైద్యులు చెబుతారు. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉండటమే కాకుండా జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవులతోని కలిసి వృద్ధాప్యానికి చెక్ పెడతాయి. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

అరటిపండు..

బరువు తగ్గడానికి బెస్ట్ మెడిసిన్ లా అరటిపండును చెప్పుకుంటారు. ఎందుకంటే బనానా తింటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బనానాలోని పొటాషియం స్కిన్ కాపాడటంలో మేలు చేస్తుంది.

కివి ఫ్రూట్..

ప్రతి రోజూ ఒక కివి పండు తింటే మీ స్కిన్ దగదగ మెరిసిపోతుంది. వృద్ధాప్య సంకేతాలు రాకుండా చర్మం యవ్వనంగా మారుతుంది. కివిలో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్, న్యూట్రియెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి.

నారింజపండు..

చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో నారింజపండు అద్భుతంగా పనిచేస్తుంది. నారింజలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్కిన్ ముడతలు రాకుండా చేస్తాయి. దీంతో మీరు ఎలాంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం ఉండదు.

పుచ్చకాయ..

వాటర్ మెలన్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. దీనిలో 92 శాతం నీరే ఉంటుంది. కాగా వాటర్ మెలన్ లోని విటమిన్ ఏ, ఈ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు రాకుండా కాపాడుతాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Also Read: డయాబెటిస్‌‌కు ఇక గుడ్ బై.. పర్మినెంట్ సొల్యూషన్‌ను కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు..

Next Story

Most Viewed