Pocharam Srinivas Reddy: తెలంగాణ రావడం వల్లే మన ప్రాంతం అభివృద్ధి..

by Vinod kumar |   ( Updated:2023-06-08 11:39:49.0  )
Pocharam Srinivas Reddy: తెలంగాణ రావడం వల్లే మన ప్రాంతం అభివృద్ధి..
X

దిశ, బాన్సువాడ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడంతోనే అభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని ఊర చెరువు పండుగకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గోన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టం వచ్చి కేవలం 9 ఏండ్లు మాత్రమే అయ్యిందని, కానీ 70 ఏండ్లు ఇతర పార్టీలు చేయని అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ రాష్టంలో 850 ఏండ్ల క్రితం రెడ్డి రాజులు 73 వేల చెరువులను తవ్వించారని, ప్రస్తుతం 46 వేల చెరువులు ఉన్నాయన్నారు. వీటి కింద 30 లక్షల ఎకరాల పంట సాగవుతున్నదన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మిషన్ కాకతీయలో భాగంగా 21 వేల 382 చెరువులను సుమారుగా 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. కేవలం బాన్సువాడ నియోజకవర్గంలోనే 250 చెరువులకు 150 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు వ్యాధి గ్రస్తులకు ఆసరా పింఛన్ ఇస్తున్నామని, ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న దేశంలోనే తెలంగాణ రాష్టం ఒక్కటే అన్నారు.

తెలంగాణలో అందిస్తున్న పథకాల కోసం పక్క రాష్టాల ప్రజలు ఎదురు చూస్తున్నారని అయన తెలియజేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రజలతో పండుగ చేసుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు. కేవలం నాకు భార్య పిల్లలు మాత్రమే కుటుంబ సభ్యులు కాదని, నియోజకవర్గంలోని ప్రజలందరూ నా కుటుంబ సభ్యులేనని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజమణి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, ఎంపీటీసీ ఇందిర, సోసైటీ చైర్మన్ గంగారాం, నీటి పారుదల శాఖ ఎస్ ఈ వాసంతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed