వరి పంట కోయని రైతుల వివరాలు సేకరించాలి

by Sridhar Babu |
వరి పంట కోయని రైతుల వివరాలు సేకరించాలి
X

దిశ, కామారెడ్డి : ఇంకా వరి పంట కోయని రైతు పేరు, సాగు విస్తీర్ణం వివరాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సేకరించే విధంగా మండల వ్యవసాయ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం రాత్రి వ్యవసాయ, సహకార, సివిల్ సప్లై అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సహకార సంఘాల, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న కుప్పల వివరాలు, ధాన్యం క్వింటాళ్ల వివరాలు అంచనా వేసి జిల్లా సహకార అధికారులు లెక్కలు

తీసుకోవాలని తెలిపారు. కొద్దిగా ధాన్యమున్న కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపి కొనుగోలు తక్షణమే పూర్తి చేయాలని సివిల్ సప్లై అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం ఉంటే దానిని బాయిల్డ్ మిల్లులకు పంపించాలని చెప్పారు. మన ఊరు- మన బడి కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉంటే తక్షణమే పూర్తి చేయించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం పనులను వేగవంతం చేసే విధంగా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని వెల్లడించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఐకెపిడీపీఎం రమేష్ బాబు, సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed