- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు, ధర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? అని ఆరా తీశారు. ధాన్యం విక్రయించిన రైతులకు త్వరితగతిన బిల్లుల చెల్లింపుల కోసం ట్యాబ్ లో వెంటవెంటనే వివరాలు నమోదు చేయాలని సూచించారు. కొత్తగా ట్యాబ్ లు కేటాయించబడిన కేంద్రాల నిర్వాహకులు తక్షణమే డివైస్ మ్యాపింగ్ చేసుకోవాలని అన్నారు. ఎలాంటి గందరగోళం, పొరపాట్లకు తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు.
అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, కొనుగోలు కేంద్రాలతో పాటు మిల్లుల వద్ద ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ వెంటవెంటనే జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అన్ని కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు సమకూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం అంబదాస్ రాజేశ్వర్, డీసీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.