కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా

by Sridhar Babu |
కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా
X

దిశ, భీంగల్ : వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంక్సపూర్ గ్రామం శివారులో కుక్కను తప్పించబోయిన ఆటో పల్టీ కొట్టిన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ సయ్యద్ నజీర్ (56) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొన్న ఎస్సై పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. అనంతరం మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన మృతుడు నజీర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Next Story