ఆలయ హుండీ దొంగ అరెస్ట్​

by Sridhar Babu |
ఆలయ హుండీ దొంగ అరెస్ట్​
X

దిశ, భీంగల్ : మండల కేంద్రంలోని బడా భీంగల్ చౌరస్తా వద్ద గల అభయాంజనేయ స్వామి ఆలయంలో హుండీ సొమ్మును దొంగిలించిన వ్యక్తిని పట్టు కున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. మంగళవారం సంఘటన వివరాలను వివరించారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు అనుమానస్పదంగా ఆదర్శనగర్ కాలనీ వద్ద పరిగెడుతూ కనిపించిన కొనపూర్ రాజగౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుణ్ణి విచారించగా అభయాంజనేయ స్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లానని ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడు రాజాగౌడ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టు ఎస్సై వివరించారు.

Advertisement

Next Story