వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

by Shiva |
వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
X

ఒక ట్రాక్టర్, రూట్వేటర్లు, వ్యవసాయ పనిముట్లు రికవరీ

చాకచక్యంగా కేసును ఛేదించిన స్పెషల్ టీం

దిశ, తాడ్వాయి : మండల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడ్వాయి మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో సోమవారం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. 14న రాత్రి సమయంలో దేవయిపల్లి గ్రామానికి చెందిన ఏనుగు జైపాల్ రెడ్డి వ్యవసాయ పొలంలోని రొటీవేటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారంటూ పోలీస్ స్టేషన్ లో చేశారు.

అదేవిధంగా కృష్ణజివాడి గ్రామానికి చెందిన కుమ్మరి శ్యాం రొటీవేటర్ ను, రాజంపేట మండలంలో మరో రొటీవేటర్, ఓనాగలిని ఎత్తుకెళ్లారు. అదేవిధంగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద నాగలి దొంగతనానికి గురైంది. ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేస్తూ సీసీ టీవీ, సాంకేతిక ఆధారాల సాయంతో ఇద్దరు నేరస్థులపై వచ్చిందన్నారు. వారిని పట్టుకుని తమదైన స్టైల్ లో విచారించగా ఆ దొంగతనాలు తామే చేసినట్లుగా ఒప్పుకున్నారు.

దీంతో తాడ్వాయి ఎస్సై ఆంజనేయులు లోతుగా విచారించగా మొత్తం ఐదు దొంగతనాలకు పాల్పడినట్లుగా నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. దొంగిలించిన వాటిలో ఓ రొటీవేటర్, నాగలి తమ సొంత పరికరాలని నమ్మబలికి పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన మంగళి బాబుకు అమ్మారని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మిగతా వ్యవసాయ పరికరాలను నేరస్తుల ఇంటి వద్ద పట్టుకొవడమే గాక వారి వద్ద రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

పట్టుబడిన నేరస్థులు తిమ్మాకపల్లి గ్రామానికి చెందిన భయమోల్ల స్వామి (45) ఏ1 నిందితునిగా గుర్తించమని, సోమారం గ్రామానికి చెందిన బోధసు సాయిలు (31) ఏ2 నిందితునిగా గుర్తించమని తెలిపారు. వీరిద్దరిని సోమవారం ఉదయం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచనట్లు ఆయన వెల్లడించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న స్పెషల్ టీం కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామాన్, ఎస్సై ఆంజనేయులు, ఏఎస్సై సంజీవులు, రమేష్, రాజు నాయక్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story