శిశుమందిరాల్లో విద్యను అభ్యసించడం గొప్ప వరం

by Sridhar Babu |
శిశుమందిరాల్లో విద్యను అభ్యసించడం గొప్ప వరం
X

దిశ, నిజామాబాద్ సిటీ : శిశు మందిరాలలో విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టం లాంటిదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ శ్రీ సరస్వతి శిశు మందిర్ 32వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ధన్ పాల్ మాట్లాడుతూ శిశు మందిరాలలో విద్య అభ్యసించడం ఒక గొప్ప వరం అని, విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తి, మన సంస్కృతి, సంప్రదాయాలను చిన్నప్పటి నుండే నేర్పిస్తారని, మిగతా విద్యార్థులకు ఆదర్శంగా ఉంటారని,

గొప్ప, గొప్ప లక్ష్యలను సాధించిన వారిలో చాలా మంది శిశు మందిరాల విద్యార్థులే ఉండటం గర్వకారణం అని తెలిపారు. కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా విద్యార్థులకు అన్ని రంగాలలో నైపుణ్యం పెంపొందిస్తూ ముఖ్యంగా మన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలను, నిలబెట్టే క్రమంలో ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపెట్టడానికి కృషి చేస్తున్న యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధస్, డా.రాజేంద్ర ప్రసాద్, పవన్ కేడి, ప్రసాద్, రాజశేఖర్, మేఘ, నాగరాజు ,బీజేపీ జిల్లా ఉపధ్యక్షులు నాగోళ్ల లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు దోర్నాల రవి, మఠం పవన్, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed