- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రస్థాయి బహుమతులు అందుకున్న ఏరుగట్ల విద్యార్థులు
దిశ, ఏర్గట్ల : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త వారు విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కథలు, వచన కవిత్వం, వ్యాసరచన పోటీలలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వ్యాసరచన పోటీలలో 9వ తరగతి చదువుతున్న అభిలాష్ మొదటి బహుమతి మూడు వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందుకోగా, 9వ తరగతి చదువుతున్న జక్కని వైష్ణవి వ్యాసరచన పోటీలలో ప్రోత్సాహక బహుమతి వేయి రూపాయల నగదు, జ్ఞాపిక ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
ఎనిమిదో తరగతి విద్యార్థిని నూనె శ్రీనిధి కథల పోటీలలో ప్రోత్సాహక బహుమతి వేయి రూపాయల నగదు బహుమతి జ్ఞాపిక ప్రశంసాపత్రాలను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో గురువారం జరిగిన బహుమతి ప్రధానోత్సవం లో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ, తెలంగాణ సాహిత్య సంగీత అకాడమీ చైర్మన్ అలేఖ్య చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నట్లు పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలిపారు. రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించి పాఠశాలకు గౌరవం పెంచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు అభినందించారు.