రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అందుకే పాదయాత్ర చేస్తుండ్రు..

by Sumithra |
రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అందుకే పాదయాత్ర చేస్తుండ్రు..
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భూత్ స్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ఇంచార్జి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలగి చంద్రశేఖర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ బూత్ స్వశక్తికరన్ అభియాన్ లో భాగంగా ఆదివారం ఆర్మూర్ మున్సిపల్ లోని పెరికిట్లో గల జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మొన్నటి వరకు జరిగిన శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లు విజయవంతం కావడానికి ఇంచార్జులే ప్రధాన కారణమన్నారు. రాబోయే కాలంలో బూత్ స్థాయిలో పని యోజన కోసం కార్యకర్తలను ఉత్తేజ పరచడానికి ప్రతి బూతుకు మండల, అసెంబ్లీ, జిల్లా, పార్లమెంట్, రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు ఆయా బూత్ లలో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను రాబోయే ఎన్నికలకోసం సమాయత్తం చేశారన్నారు. కొత్తవారిని సైతం ప్రోత్సహించడానికై ఈ బూత్ స్వసక్తికరణ్ అభియాన్ అమృతంలా పనిచేస్తుందన్నారు. ఈ బూత్ స్వసక్తికరణ్ అభియాన్ ను విజయవంతం చేసినట్లయితే తప్పక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయడం కాయమన్నారు.

ప్రతి కార్యకర్త రేపే ఎన్నికలు అన్నట్లుగా భావిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదిలాబాద్ జిల్లా బీజేపీ ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, ఆర్మూర్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆర్మూర్ అసెంబ్లీ బీజేపీ నాయకురాలు విజయ భారతి రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాదాద్రి భాస్కర్, నాయకులు జెస్సు అనిల్ కుమార్, ఉదయ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed