రైతులు అధైర్య పడొద్దు.. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్

by Sumithra |
రైతులు అధైర్య పడొద్దు.. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్
X

దిశ, నిజాంసాగర్ : అల్పపీడన ధోరణితో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. రైతులు అధైర్య పడకుండా సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు పరిశీలించారు. ప్రాజెక్టు నీటిమట్టం, ఇన్ఫ్లో , నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా రైతులు సంతోషంగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన అన్నారు. భారీ రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు కుంటలు నిండి జలమయమయ్యాయి. పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారి పొంగి పొర్లు ఉండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 32వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అన్నారు.

దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు 1401.45 అడుగులకు నీరు చేరుకుందని అన్నారు. ఆయకట్టు రైతులు అధైర్య పడకుండా సంతోషంగా వ్యవసాయ పండగను జరుపుకోవాలని కోరారు. కాంగ్రెస్ పాలన ప్రజల పాలన, పేదల పాలన, రైతు సంక్షేమ పాలన అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులు ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆయన అన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు 13 టీఎంసీలకు చేరుకుని నిండుకుండలా మారిందని అన్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకొని చేరుకుంటుందని అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1401.45 అడుగుల నీరు ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.015 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆయనతో నిజాంసాగర్ మాజీ జెడ్పీటీసీ చికోటి జయ ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు కుమార్, శీను సెట్, బోడ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story