కేసీఆర్ మరో పొలికేక.. మహారాష్ట్రలో రెండవ బీఆర్ఎస్ బహిరంగ సభ

by S Gopi |   ( Updated:2023-03-22 03:16:37.0  )
కేసీఆర్ మరో పొలికేక.. మహారాష్ట్రలో రెండవ బీఆర్ఎస్ బహిరంగ సభ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోదన్ నియోజకవర్గాలలోని ద్వితియ శ్రేణి నాయకులు లోహ బాటపట్టారు. నాందేడ్ జిల్లా లోహలో తిష్ట వేసిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకిల్ అమీర్ లు గత వారం రోజులుగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువేళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. 16వీడియో స్క్రీన్ ప్రచార రథాలు కాందార్ లోహ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 16 తాలూకాలలో ఉన్న 1600 గ్రామాల్లో తెలంగాణ పథకాల గురించి మహారాష్ట్ర ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే శంకర్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్ష్ తివారి, మహా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదంలాంటి నాయకులతో కలిసి ప్రచార కరపత్రాలను ముద్రించి నియోజకవర్గం అంతా వాల్ పోస్టర్ లు వేశారు. లిక్కర్ స్కాం ఉదంతం నేపథ్యంలో అందరు మంత్రులు, జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లిన లోహ సభపై కేసీఆర్ ప్రతిష్టత్మకంగా తీసుకోవడంతో ఇద్దరిని మహారాష్ర్ట నుంచి కదిలించలేదు.

లోహలో లక్ష మంది జనంతో నిర్వహించే సభ సక్సెస్ కోసం ఆర్మూర్, బోదన్ నియోజకవర్గాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను తరలిస్తున్నారు. ఎమ్మెల్యేలు. అక్కడ ప్రజలను మోబిలైజేషన్ భాధ్యతలను అక్కడ లోకల్ లీడర్లతోపాటు ఇక్కడ నాయకులకు భాధ్యతలను అప్పగించారు. లోహ సభలో పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్ లో చేరే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. నాందేడ్ సభ విజయవంతంగా పూర్తి చేసిన అనుభవంతో లోకల్ లీడర్లతో ఇక్కడి లీడర్లను సమన్వయం చేసుకుంటూనే సక్సెస్ అవుతామని నమ్మి రెండు నియోజకవర్గాల లీడర్లకు స్వయంగా ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి రప్పిస్తున్నారు. ఉగాది పండుగ ఉన్నా సరే అక్కడే సభ అయిపోయేవరకు ఉండాలని లీడర్లకు హుకూం జారీ చేశారు. దాంతో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు, ప్రజాప్రతినిధులు లోహకు బయలుదేరి వెళ్లగా మరికొందరు పండుగ తరువాత తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

లక్ష మందికి పైగా మహా జనంతో సభ

అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచి దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్ ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జై కొడుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో జరిగే బీఆర్ఎస్ మహాసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకకై మరాఠీ సోదరులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాందార్ లోహ సభ ద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతమవుతుందన్నారు.



దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ

అభివృద్ధి, సంక్షేమానికి అగ్రగామి గా నిలిచి దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్ ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న సీఎవ కేసీఆర్ గారికి జై కొడుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో మంగళవారం జరిగి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకకై మరాఠీ సోదరులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లకు స్థానిక ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి హిమాన్ష్ తివారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం, గణేష్ బాబు కదం, సంతోష్ వార్కడ్, ప్రవీణ్, అంకిత్ యాదవ్, శివరాజ్ ధోండ్గే, సునీల్ ధోండ్గే, విజయ్ ధోండ్గే, దత్తా కారముంగే, అజయ్ అంకరి, విశ్వంబర్ పాటి ల్, శివరాజ్ పాటిల్, అప్పారావు పాటిల్ రఘు, రాజు, స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

26న బహిరంగ సభకు తరలి రావాలి

మహారాష్ట్రలోని కందార్ లోహలో ఈ నెల 26న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు తరలిరావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ ఎస్ నాయ కులతో కలిసి మహారాష్ట్రలోని కుందార్ లోహాలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ డార్లింగ్ రమేష్, మాక్లుర్ సొసైటీ చైర్మన్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed