బ్రేకింగ్.. ఢిల్లీకి రావాలని ఎంపీ అరవింద్‌కు స్పీకర్ పిలుపు

by Disha News Desk |
బ్రేకింగ్.. ఢిల్లీకి రావాలని ఎంపీ అరవింద్‌కు స్పీకర్ పిలుపు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు పార్లమెంట్ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఫోన్ చేశారు. శుక్రవారం అరవింద్ కు ఫోన్ చేసిన స్పీకర్ ఆర్మూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి ఎలా జరిగింది ..పోలీసులు వ్యవహరించిన తీరును స్పీకర్ కు వివరించిన ధర్మపురి అరవింద్ . రాష్ట్ర ప్రభుత్వం తన పై పోలీసుల సహకారంతో హత్యాయత్నం చేసిందని ఎంపీ అరవింద్ స్పీకర్ కు చెప్పారు. వెంటనే ఢిల్లీకి రావాలని చెప్పిన స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా. మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు

Advertisement

Next Story